Winter Health Tips: ఆరోగ్యంపై చలికాలంలో శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో మనకు ఆహారాలు త్వరగా జీర్ణం కావు. అందుకే మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే అజీర్తి సమస్య వెంటాడుతుంది. ఫలితంగా శీతాకాలంలో వ్యాధులు చుట్టుముడతాయి. ఆకుకూరలు, కూరగాయలు, ఉసిరికాయ, బొప్పాయి, అనాస పండు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. మన ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోకపోతే దుష్పరిణామాలు ఎదురవుతాయి. అందుకే అప్రమత్తంగా ఉంటేనే మేలు.

ఉదయం పూట వాకింగ్ చేయడం మంచిది. చలితీవ్రత ఎక్కువగా ఉంటే కనీసం 7-8 గంటల ప్రాంతంలో అయినా నడక కొనసాగించాలి. చలికాలంలో వాకింగ్ మనకు దివ్య ఔషధంగా మారుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో ఉత్తమం. చలి ఎక్కువగా ఉన్నందు వల్ల వాహనాలపై వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి. తలకు హెల్మెట్ పెట్టుకోవాలి. స్వెటర్లు ధరించాలి. చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. కాళ్లకు షూ తప్పనిసరి. ఇలా శరీరం మొత్తం కప్పుకునేలా చేసుకుంటేనే చలి నుంచి రక్షించుకోవచ్చు.
శీతాకాలంలో పొడి చర్మం ఉన్న వారికి ఇబ్బందులే వస్తాయి. అలాంటి వారు చర్మానికి మాయిశ్చరైజ్ కోల్డ్ క్రీములు రాసుకుంటే ఫలితం ఉంటుంది. ఎందుకంటే చర్మం పేలిపోయి కనిపిస్తుంది. మనం వాడే సబ్బులలో సున్నం శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. స్నానానికి చన్నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటిని వినియోగించాలి. లేదంటే చలికి వణుకు పుడుతుంది. శీతల పానీయాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. లేదంటే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ ను తీసుకోకపోతేనే మంచిది.

విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవాలి. చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. చలికాలంలో జాగ్రత్తలు పాటించకపోతే నష్టాలే వస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి ఆహారం తీసుకోవాలి. మసాలాలకు దూరంగా ఉంటేనే ఫలితం. లేదంటే తిన్న ఆహారాలు జీర్ణం కాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిగతా కాలాల కంటే చలికాలం మన ఆరోగ్యం కోసం అప్రమత్తంగా ఉండాల్సిందే. మంచి ఆహారాలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లేకపోతే జబ్బుల బారిన పడితే అంతేసంగతి.