Vasthu Tips : పక్షులన్నింటిలో గుడ్లగూబ ప్రత్యేకం. ఇది అరుదుగా కనిపిస్తుంది. దీని అరుపు చూస్తే చిన్న పిల్లలు భయపడిపోతుంటారు. ఇంటి వద్ద గుడ్లగూబ అరిస్తే ఏదో జరుగుతుందని కొందరు భావిస్తుంటారు. కొందరు ప్రయాణాలు చేసేవారు తమకు గుడ్లగూబ కనిపిస్తే అరిష్టం అని అంటారు. కానీ లక్ష్మీదేవి వాహనం గుడ్ల గూబ అంటారు. ఇది చూడ్డానికి భయంకరంగా ఉన్నా.. ఇది చేసే అరుపులు వినరాకుండా ఉన్నా గుడ్లగూబ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గుడ్లగూబను రాత్రి సంచరించే రాజుగా పిలుస్తారు. ఎందుకంటే ఇది ఎక్కువగా రాత్రి మాత్రమే కనిపిస్తుంది. గుడ్లగూబలు రకరకాలుగా ఉంటాయి. వీటిలో సాధారణంగా నలుపు లేదా గోధుమ రంగు గుడ్లగూబను చూసి ఉంటాం. కానీ తెల్ల గుడ్లగూబలు కూడా ఉంటాయి. అయితే తెల్ల గుడ్లగూబను చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? అలాగే గుడ్లగూబ ఉన్న చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా?
వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. ఇంటిని వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటారు. అలాగే ఇంట్లోని కొన్ని వస్తువులను వాస్తు ప్రకారంగా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో రకంగా నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీనిని పారద్రోలడానికి కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. వీటిలో గుడ్లగూబ విగ్రహం ఒకటి. అయితే గుడ్లగూబ విగ్రహం ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తెస్తుందని అంటున్నారు.
అయితే తెల్ల గుడ్లగూబతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి తెల్ల గుడ్లగూబ కనిపిస్తే అతని పూర్వీకులు కనిపించారని భావిస్తుంటారు. అయితే తరుచూ గుడ్ల గూబ కనిపిస్తే జీవితంలో ఏదో ఆనందం రాబోతుందని అర్థం. ఏదైనా పని కోసం వెళ్తుండగా ఎడమ వైపు గుడ్ల గూబ కనిపిస్తే ఆ పని సక్సెస్ అవుతుందని అంటారు. అంతేకాకుండా ఆర్థికంగా సమస్యలు ఉంటే అప్పటి నుంచి తొలగిపోతాయని అర్థం. పగటిపూట గుడ్ల గూబ కనిపిస్తే శుభవార్తలు వింటారు. అలాగే కొన్ని అదృష్టాలు రాబోతున్నాయని అర్థం.
గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అందువల్ల గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అరిష్టాలు తొలగిపోతాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా దీని ద్వారా నరద్రిష్టి నుంచి బయటపడుతారు. దీనిని ఇంట్లోకి ప్రేవేశించే ద్వారం వద్ద ఎదురుగా ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఎవరి దృష్టి అయినా ఈ విగ్రహం పైనే పడుతుంది. గుడ్ల గూబ చూడ్డానికి భయంకరంగా ఉంటుంది. అందువల్ల కొందరి శత్రువులు వేరే రకంగా దృష్టి సారించినా ఇది గ్రహిస్తుందని అంటారు. దీంతో మనుషులకు ఎలాంటి నష్టం ఉండదని అంటున్నారు.
ఇంట్లోనే కాకుండా కార్యాలయాల్లో కూడా గుడ్లగూబ విగ్రహాన్ని ఉంచుకోవచ్చని అంటున్నారు. కార్యాలయాల్లో ప్రధాన టేబుల్ పై దీనిని పెట్టుకోవచ్చు. ఇది ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుది. వ్యాపారం నిర్వహించేవారు సైతం గుడ్లగూబను కౌంటర్ టేబుల్ పై ఉంచాలి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవికి దగ్గరగా ఉన్నట్లవుతుంది. దీంతో అమ్మవారు సంతోషించి ఆ వ్యక్తులకు శుభప్రదం కలిగిస్తుంది.