https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు కలిసివస్తాయి..

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇవి లాభాదాయకంగా ఉంటాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకోగలుగుతారు. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరుతారు. కొత్త పెట్టుబుడులకు ఈరోజు అనుకూలం. శుభకార్యాల్లో పాల్గొంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 22, 2024 / 08:19 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురువారం ద్వాదశ రాశులపై ఉత్తరభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా సర్వార్ద సిద్ధియోగం, ఏర్పడుంది.దీంతో కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావొచ్చు. బంధువుల నుంచి ధన సాయం పొందుతారు. తండ్రి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు.

    వృషభ రాశి:
    ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇవి లాభాదాయకంగా ఉంటాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకోగలుగుతారు. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరుతారు. కొత్త పెట్టుబుడులకు ఈరోజు అనుకూలం. శుభకార్యాల్లో పాల్గొంటారు.

    మిథున రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగతంగా సంబంధాలు మెరుగుపడుతాయి. మాటలను నియంత్రించుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులతో గొడవలు ఉండే అవకాశం.

    కర్కాటక రాశి:
    పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్ లో ఉన్న ఆదాయం వసూలవుతుంది. కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద వహిస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు.

    సింహారాశి:
    ఆర్థికంగా పుంజుకుంటారు. విద్యార్థుల కోసం డబ్బు కూడబెడుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    కన్య రాశి:
    కొందరు శత్రువులతో జాగ్రత్త. తెలిసిన వారితో చిక్కులు ఏర్పడుతాయి. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ప్రతిష్టతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

    తుల రాశి:
    భవిష్యత్ గురించి ఆలోచించి విలువైన పెట్టుబడులు పెడుతారు. విహాయ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి కొన్ని సమస్యల్లో చిక్కుకున్నా తెలివిగా బయటపడుతారు.

    వృశ్చిక రాశి:
    ఉద్యోగులకు పనిభారం అధికంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. స్నేహితుడి సాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం బహుతిని కొనుగోలు చేస్తారు.

    ధనస్సు రాశి:
    విద్యార్థులు కెరీర్ కోసనం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బ్యాంకు రుణం చెల్లిచడం కష్టతంగా మారుతుంది. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులలో ఏదైనా ఒకరిది వివాహానికి అడ్డంకులు ఏర్పడుతాయి.

    మకర రాశి:
    పెట్టుబడుల కోసం పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం డబ్బు ఖర్చు చేస్తారు.

    కుంభరాశి:
    పిల్లల వివాహానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. కొత్త వ్యక్తులకు డబ్బు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.

    మీనరాశి:
    విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. పెండింగులో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. వ్యాపారులు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.