Traveling: ట్రావెలింగ్ అనేది ఒక థ్రిల్లింగ్ యాక్టివిటీ కదా. అడ్వెంచర్ లకు వెళ్లాలన్నా, ట్రావెల్ చేయాలన్నా ముందు ఆహారం మీద దృష్టి పెట్టాలి. విహారయాత్రకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయాలలో ఒకటి స్థానిక వంటకాలు. ఈ వంటకాలను తినడం బెటర్. మీరు ఎక్కడికి వెళ్లాలి అనుకున్న ప్రతి సారి వెంట వంటలను, పదార్థాలను తీసుకొని వెళ్లడం కష్టం. సో మీరు వెళ్లిన ప్రాంతంలో ఉన్న స్పెషల్ వంటకాలను తినాలి అనిపిస్తుంటుంది. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడ స్పెషల్ గా ఉండే వంటకాలను తినాలి అనిపిస్తుంటుంద. కానీ అందులో ఏది మంచిది కాదు అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. అయితే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు వేటిని ఎంచుకోవడం బెటర్? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1.స్థానిక పండ్లు, కూరగాయలు: మీరు వెళ్లిన దగ్గర పండే కూరగాయలు, పండ్లను తినడం చాలా మంచిది. మీరు ఎక్కడికి అయినా వెల్లారు అనుకుందాం. అక్కడ స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, ప్లమ్స్ ఉంటే వాటిని తినాలి. ఈ పండ్లు ఫ్రెష్‌గా ఉంటాయి. అంతేకాదు మీకు విటమిన్లు, ఖనిజాలు ఫైబర్ లను అందిస్తాయి. అవి మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. పండ్లు మాత్రమే కాదు స్థానిక కూరగాయల గురించి మర్చిపోవద్దు. ఇక తాజా ఆకుకూరలతో చేసిన రంగురంగుల సలాడ్ లను కూడా అసలు మర్చిపోకండ.
2. స్థానిక చీజ్లు: ఏదైనా సెలవు ఉన్నప్పుడు మీరు ఎక్కడికి అయినా వెళ్తే చీజ్‌లు బెటర్. వీటిని పచ్చి పాలతో తయారు చేస్తారు. ఇందులో గట్ ఆరోగ్యానికి సహాయపడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది అంటున్నారు నిపుణులు. వీటకి తోడు అదనంగా ప్రోటీన్, కాల్షియం కూడా లభిస్తాయి. క్రీమీ చీజ్ లు ఎప్పుడు కూగా మంచివే. రుచికరమైన, సంతృప్తికరమైన అల్పాహారం కోసం ఈ చీజ్ లను కొన్ని తాజా కూరగాయలతో ఎంజాయ్ చేయండి.
3. తాజా పదార్థాలతో చేసిన స్థానిక వంటకాలు: వంటకాలు ఎప్పుడు ఆరోగ్యకరమైనవే. ఎందుకంటే “కొన్ని భోజనాలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. వంటచేసిన కొంత సమయం వరకు మాత్రమే బాగుంటాయి. అంటే ఇందులో ఎలాంటి బ్యాక్టీరియా నిల్వ ఉండదు. రుచి, పోషకాలతో కూడా నిండి ఉంటాయి. సో తాజా పదార్థాలతో చేసిన వంటకాలను మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంచుకోవచ్చు.
4. పులియబెట్టిన ఆహారాలు: పెరుగు, కేఫీర్, సౌర్‌క్రాట్, కిమ్చీలు కూడా మీకు మంచి కంపెనీ ఇస్తాయి. వీటిని కూడా మీ జర్నీలో జోడించుకోవచ్చు.
5. స్థానిక డెజర్ట్‌లు: “గింజలు, ఖర్జూరాలు, పెరుగు, తేనె వంటి అనేక ఆరోగ్యకరమైన పదార్ధాలతో నిండి ఉంటాయి కాబట్టి.. స్థానిక డెజర్ట్‌లను తప్పనిసరిగా ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు.
6.. ఇంట్లో నుంచి: కొన్ని ఆహార పదార్థాలు ఇంటి నుంచి తీసుకొని వెళ్లినా వారం రోజుల వరకు కూడా పాడవవు. అలాంటివి చేసుకొని తీసుకొని వెళ్లడం వల్ల కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారమంటే టేస్ట్ మాత్రమే కాదు. విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం మర్చిపోవద్దు.