https://oktelugu.com/

Cinnamon : దాల్చిన చెక్కలో ఇవి కలిపితే.. ముఖం మెరవడం గ్యారెంటీ!

సహజంగా ఇంట్లోనే ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటే ఎల్లప్పుడు ముఖం గ్లోగా కనిపిస్తుంది. అందరి ఇంట్లో సాధారణంగా దాల్చిన చెక్క ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ దాల్చిన చెక్కతో ముఖాన్ని కాంతివంతంగా మెరిపించుకోవచ్చు. ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 8, 2024 7:17 pm
    Cinnamon

    Cinnamon

    Follow us on

    Cinnamon : అందరిలో అందంగా కనిపించాలని అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటారు. ముఖం కాంతివంతంగా మెరవాలని ముఖానికి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వంటివి రాస్తుంటారు. అయితే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్‌లో హానికర రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతిస్తాయి. అందరిలో ముఖం మెరవాలంటే బయట దొరికే ప్రొడక్ట్స్‌ను వాడకుండా వంటింట్లో దొరికే పదార్థాలతో మెరిపించవచ్చు. ఇంట్లో ఉన్న కొన్నిసార్లు ముఖం ట్యాన్ అయిపోతుంది. అందులోనూ బయటకు వెళ్తే.. ఇంకా చెప్పక్కర్లేదు. ఒక్కసారికే ముఖమంతా నల్లగా మారిపోతుంది. ఏదైనా క్రీమ్ ముఖానికి అప్లై చేసిన కూడా ఆ నిమిషానికి ముఖం అందంగా కనిపిస్తుంది. కానీ తర్వాత మళ్లీ నల్లగా అయిపోతుంది. ముఖం ఎల్లప్పుడూ మెరవాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సహజంగా ఇంట్లోనే ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటే ఎల్లప్పుడు ముఖం గ్లోగా కనిపిస్తుంది. అందరి ఇంట్లో సాధారణంగా దాల్చిన చెక్క ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ దాల్చిన చెక్కతో ముఖాన్ని కాంతివంతంగా మెరిపించుకోవచ్చు. ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    దాల్చిన చెక్క, తేనె ఫేస్ ప్యాక్
    ఆరోగ్యానికి మేలు చేసే దాల్చిన చెక్క సాధారణంగా అందరి ఇంట్లో ఉంటుంది. ఈ చెక్కను మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. రెండు మిశ్రమాలు బాగా కలిసిన తర్వాత చర్మానికి రాసి ఒక పది నిమిషాలు పాటు వదిలేయాలి. ఆ తర్వాత వేళ్లతో మృదువుగా చర్మాన్ని మర్దన చేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటు ముడతలు, మచ్చలు అన్ని తొలగిపోతాయి.

    నిమ్మరసంతో ఫేస్ ప్యాక్
    టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిలో నిమ్మరసం కలిపి ఫేషియల్ పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చర్మానికి అప్లై చేస్తే కళ్ల కింద ఉన్న నల్ల వలయాలు, నల్లటి మచ్చలు, మొటిమలు అన్ని కూడా తొలగిపోతాయి. ఎండలో తిరిగి బాగా నల్లగా అయిపోయిన వారు ఈ ఫేస్‌ ప్యాక్‌ను ట్రై చేస్తే రిజల్ట్ తొందరగా కనిపిస్తుంది.

    రోజ్ వాటర్‌ దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్
    రోజ్‌ వాటర్ చర్మాన్ని చాలా మృదువుగా చేయడంతో పాటు శుభ్రంగా చేస్తుంది. ముఖాన్ని మెరిపించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ వేసి చర్మానికి అప్లై చేస్తే ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి.

    దాల్చిన చెక్కతో అలోవెరా జెల్
    కలబంద చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సాధారణంగా కలబందను చర్మానికి, జుట్టుకి అప్లై చేసిన మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇందులో దాల్చిన చెక్క పౌడర్ వేసి ముఖానికి అప్లై చేస్తే చర్మం హైడ్రేట్‌గా మారుతుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.