AC Tips : ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఎయిర్ కండీషనర్(ఏసీ) వేసవిలో ఒక వరం లాంటిది. భగభగమండే ఎండ నుంచి మనలను రక్షించే ఏసీని సరిగ్గా చూసుకోకపోతే అది మనకు భారంగా మారవచ్చు. ఏసీ భాగాలను సరిగ్గా శుభ్రం చేయకపోతే అవి పాడైపోయి భారీ నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు ఏసీ కాయిల్ పచ్చగా మారడానికి గల కారణాలు ఏంటి.. సరైన సమయంలో శ్రద్ధ తీసుకోకపోతే ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలుసుకుందాం.
Also Read : తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లతో దుమ్ములేపనున్న ఇన్ఫినిక్స్ నయా ఫోన్!
ఏసీ కాయిల్ ఎప్పుడు పచ్చగా మారుతుంది?
ఏసీలో ఉండే కాపర్ కాయిల్ కాలక్రమేణా ఆక్సీకరణం చెందడం మొదలవుతుంది. తేమ తగలడం వల్ల కాయిల్‌పై కాపర్ ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది.ఇది చూడటానికి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. అంతే కాకుండా, కాయిల్‌పై తేమ ఉండిపోతే బ్యాక్టీరియా కూడా పేరుకుపోతుంది. ఆల్గే (Algae) పేరుకుపోవడం వల్ల కూడా కాయిల్ ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
నష్టం ఏమిటి?
సమయానికి కాయిల్‌ను శుభ్రం చేయకపోతే ఏసీలో అమర్చిన కాయిల్ పాడైపోయే ప్రమాదం ఉంది. ఒకసారి పాడైపోతే మీరు కాయిల్‌ను రిపేర్ చేయించాల్సి ఉంటుంది లేదా పూర్తిగా మార్చవలసి వస్తుంది. అలా జరిగితే మీకు భారీగా డబ్బు ఖర్చు అవుతుంది.
ఏసీ కాయిల్‌ను మెరిసేలా ఉంచే మార్గాలు
* క్రమం తప్పకుండా శుభ్రం చేయండి: కాయిల్‌ను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతి 2-3 నెలలకు ఒకసారి శుభ్రం చేయాలి. దీని కోసం కాయిల్ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు. తేలికపాటి బ్రష్‌తో కాయిల్స్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి. తద్వారా దుమ్ము లేదా ధూళి పేరుకుపోకుండా ఉంటుంది. ఈ పని కోసం మీరు టెక్నీషియన్‌ను సంప్రదించవచ్చు.
* ఫిల్టర్‌ను శుభ్రం చేయండి: ఎయిర్ ఫిల్టర్‌ను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. లేకపోతే తేమ, ధూళి కారణంగా బూజు , బ్యాక్టీరియా పెరిగి కాయిల్ పాడయ్యే అవకాశం ఉంది.
* ఏసీ సర్వీసింగ్: ఏసీని సంవత్సరాల తరబడి కొత్తగా ఉంచాలంటే ప్రతి 4 నెలలకు కనీసం ఒకసారి సర్వీసింగ్ చేయించాలి. దీని వల్ల ఏసీ సరిగ్గా శుభ్రం అవుతుంది. ఏసీ భాగాలు కూడా ఎల్లప్పుడూ మెరుస్తూ ఉంటాయి.