Management : ఉద్యోగం పురుష లక్షణం అని అంటారు. పురుషుడు అన్నాక ఏదో ఒక పని తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఈరోజు లో మహిళలు సైతం పురుషులకు పోటీగా రకరకాల ఉద్యోగాల్లో నిమగ్నమై పోతున్నారు. ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థ పై నమ్మకం ఉంచి అనుకున్నా లక్ష్యాలను పూర్తి చేస్తారు. అయితే కొందరు తమపై ఉన్నతాధికారులు తమను వేధిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. కొందరు వీరి వేధింపుల వల్ల ఆ సంస్థలో ఉండలేక వేరే సంస్థలకు మారిపోతూ ఉంటారు. మరికొందరు మాత్రం వారికి డబ్బు అవసరంతో ఎంత కష్టాన్నయినా భరిస్తూ ఉద్యోగం చేస్తూ ఉంటారు. అయితే ఉన్నత స్థాయిలో ఉండే ఉద్యోగులు కొన్ని లక్షణాలను ఉండటం వల్ల వారు అనుకున్న పనులు సాధించడమే కాకుండా.. ఆమె పని చేసే సంస్థకు గొప్ప పేరును తీసుకు రాగలుగుతారు. ఆ లక్షణాలు ఏంటంటే?
Also Read : దేవాలయ నిర్వహణపై మార్గదర్శకాలు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ప్రేమ:
ఒక సంస్థలో మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఉద్యోగులపై ప్రేమను కలిగి ఉండాలి. అంటే ఏదైనా విషయాన్ని మాట్లాడేటప్పుడు కాస్త వారికి అర్థమయ్యే విధంగా ఉండాలి. లేదా వారికి అవసరమైన అవకాశాలు ఇస్తూ వారి విజయానికి తోడ్పడాలి. వారి విజయం సాధించడం వల్ల మేనేజ్మెంట్కు కూడా పేరు వస్తుందని విషయాన్ని మర్చిపోవద్దు. అలాకాకుండా వారిపై కోపం లేదా ఇప్పుడు తిడుతూ ఉండడంవల్ల వారు ప్రతికూల శక్తిగా మారుతారు. దీంతో ఒక్కోసారి ఎదురు తిరిగే ప్రమాదం ఉంటుంది. అయితే ఉన్నతాధికారి స్థానంలో ఉన్నవారు ఉద్యోగుల విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండడంతో పాటు వారి అవసరాలను తీరుస్తూ ఉండాలి.
నైపుణ్యం:
ఒక సంస్థలో ఉన్నతాధికారి స్థానంలో ఉన్న వ్యక్తికి నైపుణ్యం కచ్చితంగా ఉండాలి. ఏదైనా ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తే దానిని ఎలా పూర్తి చేయాలి? తన కింది వ్యక్తులతో ఎలా పనిచేయించాలి? అనుకున్న సమయంలో ఎలా పూర్తి చేయగలగాలి? అనే విషయాలను తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఈ స్థానంలో ఉన్న వ్యక్తికి టైం సెన్స్ కంపల్సరీ ఉండాలి.ఒక పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగితే మరో అవకాశం వస్తుందని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇదే సమయంలో మిగతా వారితో కూడా పని చేయించగలిగే సత్తా ఉండాలి. వారికి కొన్ని విషయాలు సందేహాలు ఉంటే వాటిని తీర్చడానికి విషయపరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. అలా చేయడంవల్ల టీం మొత్తం అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతుంది.
సహనం:
ఉన్నతాధికారి గా ఉన్న పోస్టులో చాలామందికి కోపం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే రకరకాల ఒత్తిడితోపాటు.. కింది స్థాయి ఉద్యోగుల పని బాధ్యత కూడా తనపైనే ఉంటుంది. దీంతో అనుకున్న సమయానికి తాను పూర్తి చేస్తానా? లేదా? అని భయం ఉంటుంది. ఈ క్రమంలో సహనాన్ని కోల్పోతారు. అయితే స్థానాన్ని కోల్పోవడం వల్ల నష్టమే జరుగుతుంది. ఎంత కష్టమొచ్చినా ఓపికతో ఉండాలి. ఒక పని అనుకున్న సమయానికి పూర్తి చేసుకోకపోతే మరొక లక్షాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే కిందిస్థాయి ఉద్యోగులు అందరూ ఒకేలా ఉండరు. అలాంటప్పుడు వారి పనితీరును గమనిస్తూ వారికి మరో అవకాశం ఇస్తూ ముందుకు సాగాలి. ఇలా చేయడం వల్ల అధికారులతో పాటు సంస్థలో ఉన్న సిబ్బందికి గొప్ప పేరు వస్తుంది.
Also Read : 50-30-20 సూత్రం పాటిస్తే డబ్బుకు కొదువ ఉండదు..