Tollywood Directors : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి పలు రకాల వైవిధ్యభరితమైన కథలను ఎంచుకొని సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మన స్టార్ హీరోలు సైతం భారీ గుర్తింపును ఏర్పాటు చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసే విధంగా మన స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరో సైతం పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక చాలా సంవత్సరాల నుంచి మన స్టార్ హీరోలందరూ సంవత్సరానికి ఒక సినిమా చేస్తామని టార్గెట్ పెట్టుకున్నప్పటికి అది అసలు వర్కౌట్ అవ్వడం లేదు. మనవాళ్లు చేసేవి పాన్ ఇండియా సినిమాలు కాబట్టి ఆయా సినిమాల దర్శకులు ఒక్కో ఫ్రేమ్ ని అందంగా చెక్కుతూ సినిమా అవుట్ పుట్ బాగా రావాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ రోజులపాటు సినిమా షూట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రొడ్యూసర్స్ కి బడ్జెట్ భారం భారీగా పెరిగిపోతుంది. ఫ్యాన్స్ సైతం ప్రతి సంవత్సరం వాళ్ళ హీరోని థియేటర్లో చూడాలని కోరుకుంటూ ఉంటారు కానీ అది వర్కౌట్ అవ్వడం లేదు. దాంతో వాళ్ళు కొంతవరకు నిరుత్సాహపడుతున్నారు. ఒకానొక సందర్భంలో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం సంవత్సరానికి ఒక సినిమా చేస్తానని అభిమానులకు మాటిచ్చినప్పటికి అది వీలు కావడం లేదు. ఇప్పటికే ఆయన ‘గుంటూరు కారం’ సినిమా వచ్చి సంవత్సరం దాటింది. ప్రస్తుతం రాజమౌళి తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఎవరు క్లారిటీగా చెప్పలేరు. దానికి మరో రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి మహేష్ బాబు 2027 వ సంవత్సరంలో మళ్లీ థియేటర్లోకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి… మహేష్ బాబు పూరి జగన్నాథ్ తో చేసిన సినిమాలను మాత్రమే అనుకున్న సమయానికి రిలీజ్ చేయగలిగారు… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల ఆయన సినిమాల మీద ఎక్కువగా డేట్స్ ని కేటాయించలేకపోతున్నాడు.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది
దానివల్ల ఆయన సినిమాలు రోజురోజుకి లేటవుతున్నాయి. వీళ్లిద్దరనే కాకుండా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు సైతం వాళ్ళ సినిమాల కోసం రెండు నుంచి మూడు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటున్నారు…ఇలా చేయడం వల్ల హీరోలా మార్కెట్ అనేది భారీగా పడిపోవడమే కాకుండా ప్రొడ్యూసర్స్ యొక్క ప్రొడక్షన్ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.
తద్వారా అభిమానులకు కూడా వాళ్ళ అభిమాన హీరోలను చూడాలనే కోరిక రోజు రోజుకి నీరుగారి పోతుందనే చెప్పాలి. మరి వీటన్నింటికి కారణం దర్శకులే అంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు ప్రతి సీన్ ను అందంగా చెక్కుతూ సినిమా డేట్స్ పెంచుతున్నాడని అందువల్లే ఇదంతా జరుగుతుందని చెబుతున్నారు.
ఒకానొక సందర్భంలో పూరి జగన్నాథ్ మాత్రమే సినిమాలను అనుకున్న డేట్ కి రిలీజ్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఒక సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటున్నాడు…ఇక దర్శకులు షూట్ డేస్ తగ్గించి వీలైనంత తొందరగా సినిమాలను ఫినిష్ చేసి రిలీజ్ చేస్తే మంచింది అని హీరోల అభిమానులు కూడా కోరుకుంటున్నారు…
Also Read : మోహన్ బాబు ఇంటి గేట్ ముందు ధర్నా కి దిగిన మంచు మనోజ్..వీడియో వైరల్!