Water Bottle: మనం పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా లేదా నడక కోసం వెళ్తున్నా, నీటిని తీసుకొని వెళ్తారు. ఇక ఇప్పుడు వచ్చింది వేసవి కాలం. ఈ సమయంలో ఎక్కడికి వెళ్లినా సరే వాటర్ మస్ట్. బ్యాగ్ లో బాటిల్ మస్ట్. అయితే నీరు లేకుండా కొన్ని గంటలు గడపడం ఎంత కష్టం అవుతుందో కదా. అందుకే మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు, తాగడానికి వాటర్ బాటిల్ కొనాలి. కానీ ప్రతి వాటర్ బాటిల్ మూత (కలర్ సైకాలజీ వాటర్ బాటిల్) వేరే రంగులో ఉండటం మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ రంగుల అర్థం ఏమిటో మీకు తెలుసా? నిజానికి, ఈ రంగులు బాటిల్‌లో ఎలాంటి నీరు నింపారో తెలియజేస్తాయి. ఈ రంగుల ద్వారా నీటి రకాన్ని ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నీలం రంగు ఏం చెబుతుంది?
మనం తరచుగా రైలు లేదా బస్సులో ప్రయాణించేటప్పుడు వాటర్ బాటిల్స్ కొనడం కామన్. ఈ సీసాలలో చాలా వరకు నీలిరంగు క్యాప్ లు ఉంటాయి. ఇది మీరు గమనించే ఉంటారు. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం దాగి ఉంది. అవును మీరు విన్నది నిజమేనండోయ్. అయితే నిజానికి, నీలం రంగు బాటిల్ మూత అందులో ఉన్న నీరు మినరల్ వాటర్ అని లేదా దీనిని నేరుగా స్ప్రింగ్ నుంచి నింపారని సూచిస్తుంది.
తెలుపు – ఆకుపచ్చ మూత
నీటి సీసాల మూతల రంగులకు వాటి స్వంత ప్రాముఖ్యత ఉంది. తెల్లటి రంగు మూత ఈ వాటర్ నార్మల్ వాటర్ అని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు రుచిగల నీటిని తెలుపుతుంది. అంతేకాదు కొన్ని బ్రాండ్లు తమ బ్రాండ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మూత రంగులను ఎంచుకుంటారు. అయితే ప్రతి సీసాపై నీటి గురించి పూర్తి సమాచారం ఉంటుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. చదివి, చూసి తీసుకుంటే సరిపోతుంది.
మూత రంగును బట్టి నీటి రకం
వాటర్ బాటిల్ మూతల రంగులు మనకు చాలా విషయాలు చెబుతాయి అంటున్నారు నిపుణులు. ఎరుపు రంగు మూత లు కూడా చాలా విధమైన విషయాలను తెలుపుతాయి. ఇక ఈ రంగు మూత మెరిసే లేదా కార్బోనేటేడ్ నీటిని సూచిస్తుందట. పసుపు రంగు మూత నీరు విటమిన్లు, ఎలక్ట్రోలైట్లతో సమృద్ధిగా ఉందని సూచిస్తుంది. నలుపు రంగు తరచుగా ప్రీమియం లేదా ఆల్కలీన్ వాటర్ బాటిళ్లపై కనిపిస్తుంది. అయితే, గులాబీ రంగు మూత రొమ్ము క్యాన్సర్ అవగాహనను చేస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.