31st December Celebration: ఎన్నో సంతోషాలు.. ఎన్నో కష్టాలు.. అవమానాలు.. జీవిత మలుపులు.. ఇవన్నీ అనుభవించిన 2025 ఏడాది వెళ్ళిపోతుంది. ఇక 2026 కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఏం చేయాలి? అన్న ఆలోచన అందరికీ ఉంటుంది. అయితే 2025 సంవత్సరాన్ని ఘనంగా వీడ్కోలు పలికేందుకు చాలామంది ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. డిసెంబర్ 31 అర్థరాత్రి ప్రత్యేకంగా విందులు నిర్వహించుకుంటూ ఉంటారు. అలాగే ఈవెంట్లు నిర్వహిస్తే అందులో పాల్గొని ఎంజాయ్ చేస్తారు. స్నేహితులతో కలిసి ప్రత్యేక ప్రదేశాలకు వెళ్తారు. ఇలా స్నేహితులతో.. ఉద్యోగులతో.. తోటి వ్యాపారస్తులతో సరదాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అయితే వ్యక్తిగతంగా ఈరోజు సంతోషంగా ఉండడం వరకు ఓకే.. కానీ ఇదే సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలని అనిపించలేదా? ఇంట్లో భార్య, పిల్లలు సైతం 31 రాత్రి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కదా? మరి అలాంటప్పుడు ఏం చేయాలి?
ప్రతి పురుషుడు పెళ్లి అయ్యేవరకు తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటాడు. ఈ సమయంలో అతడికి కొంతమంది స్నేహితులు పరిచయమవుతారు. స్నేహితులతో సంతోషాలను, కష్టాలను పంచుకుంటారు. కానీ వివాహం అయిన తర్వాత అన్ని భార్య, పిల్లలు మాత్రమే అయ్యే అవకాశం ఉంటుంది. వివాహం అయిన తర్వాత స్నేహితులతో గడపద్దని ఎవరు చెప్పరు. కానీ ఇదే సమయంలో కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఎందుకంటే ఇతరులతో పంచుకోకపోవచ్చు. కానీ సంతోషాలను మాత్రం కుటుంబ సభ్యులతో కచ్చితంగా పంచుకోవాలని అంటున్నారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ విధంగా సంతోషంగా ఉండాలి? అనే విషయంపై అవగాహన పెరిగిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో స్నేహితులతో కాకుండా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వారి జీవితం సంతోషకరంగా ఉండే అవకాశం ఉంది.
డిసెంబర్ 31 రాత్రి సమయంలో సాధారణంగా స్నేహితులతో కలిసి విందులో పాల్గొంటారు. అయితే ఆ తర్వాత కుటుంబ సభ్యులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. స్నేహితులతో కాసేపు గడిపి ఆ తర్వాత కుటుంబంతో కూడా ఇదే రోజు సరదాగా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా భార్య, పిల్లలు కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం చాలా అవసరం. అయితే డిసెంబర్ 31 రాత్రి సమయంలో వీలు కాకపోతే కొత్త సంవత్సరం సందర్భం గా మరుసటి రోజు అయినా పిల్లలతో సరదాగా బయటకు వెళ్లాలి. వీలైతే దగ్గర్లోని టూర్కు వెళ్లడం మరీ మంచిది. ఎందుకంటే కొత్త సంవత్సరం అనగానే చాలామందికి ఎక్కడా లేని ఉత్సాహం ఉంటుంది. ఇలాంటి సమయంలో కుటుంబంతో కలిసి ఇతర ప్రదేశాలకు వెళ్లడం వల్ల మనసు మరింత ఉల్లాసంగా ఉంటుంది. ఈ సమయంలో వారికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వారు కూడా కుటుంబ పెద్దపై నమ్మకం పెంచుకుంటారు.
ఈ విషయాలు చాలా చిన్నవే కావచ్చు.. కానీ ఇలా చేయడం వల్ల ఈ ఏడాదంతా కుటుంబం సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త పనిని ప్రారంభించడానికి లేదా ఏదైనా ప్రణాళిక వేసుకోవడానికి న్యూ ఇయర్ ను ఎంచుకున్నప్పుడు.. కుటుంబంతో కూడా సంతోషంగా ఉండడానికి ఈరోజును ప్రత్యేకంగా కేటాయించాలని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. అందువల్ల స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేస్తూనే మరోవైపు కుటుంబం గురించి పట్టించుకోవాలి.