Anaganaga Oka Raju: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ మీదనే అందరి కెరియర్లు ఆధారపడి ఉంటాయి. హీరోకి మరో సినిమా రావాలన్న దర్శకుడు స్టార్ హీరోతో సినిమా చేయాలనుకున్నా కూడా సక్సెస్ చక అవసరం… అలా మంచి సక్సెస్ లను సాధించినప్పుడు మాత్రమే ఇక్కడ రెడ్ కార్పెట్ పరిచి మరి ఆహ్వానాలను అందిస్తారు…ప్లాపులను అందిస్తే మాత్రం వీలైనంత తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు…కెరియర్ మొదట్లో రచయితగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అతను తన సినిమాలను చేయడమే కాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చే చాలా సినిమాలకి సజేషన్స్ సలహాలని ఇస్తూ ఉంటాడు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందని నాగ వంశీ బహిరంగంగానే తెలియజేశాడు.
నిజానికి వేరే వాళ్ళ సినిమాల్లో త్రివిక్రమ్ చేతులు పెట్టి దాన్ని మార్పులు చేర్పులు చేయడం అవసరమా? ఒక దర్శకుడు తను ఎలాంటి కథను రాసుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేయాలో ఆ దర్శకుడికి తెలియదా? త్రివిక్రమ్ వల్లే ఆ బ్యానర్లో సినిమాలు సక్సెస్ అవుతున్నాయా? ఇలా మార్పులు చేర్పులు చేయడం వల్ల ఆ దర్శకుడు అనుకున్న ఫీలయితే రాకపోవచ్చు.
దానివల్ల సినిమా ఫ్లాప్ అవ్వచ్చు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఆ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ఖాతాలోకి వెళ్తోంది. అదే సినిమా సక్సెస్ అయితే అందులో మార్పులు చేర్పులు చేసినందుకే సినిమా సక్సెస్ అయిందని ఆ క్రెడిట్ ని త్రివిక్రమ్ కొట్టేస్తున్నారు ఇలా ఇంకెన్ని రోజులు… త్రివిక్రమ్ ఎందుకని అవతల వాళ్ళ సినిమాలను జడ్జ్ చేయాలి.
ఇలాంటివి మానుకుంటే బాగుంటుంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం త్రివిక్రమ్ కి సలహాలైతే ఇస్తున్నారు. ఇకదంతా చూసిన ప్రేక్షకులు త్రివిక్రమ్ విషయంలో తప్పుపడుతున్నారు. ఎవరి సినిమాని వాళ్ళు చూసి దానిని ఫైనల్ చేసుకుంటే బాగుంటుంది. మధ్యలో ఈ త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఎందుకు అంటూ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…