Homeఎంటర్టైన్మెంట్Prabhas Fauji : ప్రభాస్ కాళ్లకు 7 వేళ్ళు.. ఫ్యాన్స్ ని మోసం చేసిన 'ఫౌజీ'...

Prabhas Fauji : ప్రభాస్ కాళ్లకు 7 వేళ్ళు.. ఫ్యాన్స్ ని మోసం చేసిన ‘ఫౌజీ’ టీం.. మరీ ఇంత దారుణమా..

Prabhas Fauji : స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే చాలు , సోషల్ మీడియా లో సందడి మామూలుగా ఉండదు. అభిమానులు సంబరాలు చేసుకుంటారు , దురాభిమానులు ట్రోల్స్ చేస్తుంటారు. ఇది ఏపాటి నుండో జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , ప్రభాస్ , రామ్ చరణ్ సినిమాలకు ఇలాంటివి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. నేడు ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్ ని విడుదల చేస్తూ […]

Prabhas Fauji : స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే చాలు , సోషల్ మీడియా లో సందడి మామూలుగా ఉండదు. అభిమానులు సంబరాలు చేసుకుంటారు , దురాభిమానులు ట్రోల్స్ చేస్తుంటారు. ఇది ఏపాటి నుండో జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , ప్రభాస్ , రామ్ చరణ్ సినిమాలకు ఇలాంటివి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. నేడు ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్ ని విడుదల చేస్తూ , ఈ చిత్రాన్ని డిసెంబర్ 3 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఇన్ని రోజులు ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే అని అంతా అనుకున్నారు, కానీ ఈరోజు విడుదల చేసిన పోస్టర్ తో ఇందులో రోమాలు నిక్కపొడుచుకొనే రేంజ్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని అర్థమైంది.

ఈ పోస్టర్ కి అభిమానులు సర్ప్రైజ్ కి గురయ్యారు , ట్రేడ్ విశ్లేషకులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఈ పోస్టర్ లోని ఒరిజినల్ స్టిల్ లో కనిపిస్తున్నది నిజమైన ప్రభాస్ కాదని , AI ద్వారా జెనెరేట్ చేయబడిన ఇమేజ్ అని , యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ కాళ్లకు 7 వేళ్ళు ఉండడాన్ని గమనించిన యాంటీ ఫ్యాన్స్ , ఒక రేంజ్ లో ప్రభాస్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఇదంతా ఫేక్ ప్రచారమని , ఒరిజినల్ పోస్టర్ లో ప్రభాస్ కాళ్లకు కేవలం 5 వేళ్ళు మాత్రమే ఉందని , కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు.

కానీ ప్రభాస్ కి ప్రస్తుతం ఈ రేంజ్ లుక్స్ అసాధ్యమని , ఇది కచ్చితంగా AI ద్వారా జెనెరేట్ చేయబడిన పోస్టర్ అని , అభిమానులను ‘ఫౌజీ’ టీం మోసం చేసిందంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ గాసిప్స్ పై కేవలం ‘ఫౌజీ’ టీం రెస్పాన్స్ ఇచ్చినప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. మరి టీం రెస్పాన్స్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ ఏడాది ఆరంభం లో ప్రభాస్ హీరో గా నటించిన ‘రాజా సాబ్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ‘ఫౌజీ’ కూడా అలాగే నిలుస్తుందని , స్పిరిట్ తో చూసుకుందాం అనే ధీమా తో ఉండేవారు ప్రభాస్ ఫ్యాన్స్. కానీ నేడు విడుదల చేసిన పోస్టర్ ని చూసిన తర్వాత వారిలో ఎవ్వరూ ఊహించని రేంజ్ ఉత్సాహం నెలకొంది. మరి వాళ్ళ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper