
జల వివాదంపై రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తే తెలంగాణ నాయకులకు అక్కడి ప్రజలే బుద్ది చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నీటి కేటాయింపులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. మూడు రాజధానుల అభివృద్ధిలో భాగంగానే కరకట్ట విస్తరణ చేపడుతున్నామని త్వరలోనే సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు ప్రారంభించి రైతులకు ప్లాట్లు అందిస్తామని వెల్లడించారు. సమాఖ్య వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయన్నారు.