స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు హీరోగా పాన్ ఇండియా లెవల్లో చేయాలని తెగ ఉత్సాహ పడుతున్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. కారణం మహేష్ అందుబాటులో ఉండకపోవడమే. ముందుగా మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తి చెయ్యాల్సి ఉంది. ఈ సినిమా పూర్తి కావాలంటే మరో మూడు నెలలు టైమ్ పట్టేలా ఉంది.
అంటే త్రివిక్రమ్ మూడు నెలలు ఆగాలి. కానీ త్రివిక్రమ్ ఆగేలా లేడు. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ కోసం ఓ స్క్రిప్ట్ రాయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఎలాగూ కథ మాటలు రాసినందుకు త్రివిక్రమ్ కు నాలుగు కోట్లు ఇస్తారు. మూడు నెలల్లో నాలుగు కోట్లు కాబట్టి మంచి బేరమే. అందుకే త్రివిక్రమ్ పవన్ సినిమా స్క్రిప్ట్ పై కూర్చోనున్నాడు. పైగా ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు.
ఇప్పటికే దిల్ రాజు త్రివిక్రమ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. మహేష్ కి ఇది నచ్చలేదు. ఈ మూడు నెలలు లోపు తనతో చేయబోయే సినిమా పై వర్క్ చేస్తే అవుట్ ఫుట్ బాగా వస్తోందనేది మహేష్ ఆలోచన. నిజానికి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అవ్వడానికి కూడా ఇదే రీజన్. ఇప్పుడు మహేష్ కూడా ఈ రీజన్ తోనే బాగా అసంతృప్తిగా ఉన్నాడు.
ఎందుకంటే త్రివిక్రమ్ మరో సినిమాకి మాటలు అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా ‘అయ్యపనం కోషియం’ రీమేక్ కోసం త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మళ్ళీ జులై 11న షురూ కానుంది, కాబట్టి, ఈ సినిమా షూట్ లో కూడా త్రివిక్రమ్ పాల్గొనడానికి అంగీకరించాడు. మరి ఈ లెక్కన త్రివిక్రమ్, మహేష్ బాబుతో చేయనున్న సినిమా స్క్రిప్ట్ బెటర్ మెంట్ కోసం ఇంకెప్పుడు టైం కేటాయించేది ?
వాస్తవానికి త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడకన్ పనులు ఎప్పుడో మొదలయ్యాయి. కానీ మహేష్ కి ఇంతవరకు ఫుల్ స్కిప్ట్ ను త్రివిక్రమ్ వినిపించలేదు. ఈ విషయంలో హారిక హాసిని క్రియేషన్స్ అధినేత కూడా చిరాగ్గా ఉన్నాడట. మరి త్రివిక్రమ్ ఇప్పటికైనా ప్లాన్ చేసుకోకపోతే మహేష్ కూడా ఎన్టీఆర్ లా దూరం జరుగుతాడు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Like ntr mahesh is also dissatisfied
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com