Homeఎంటర్టైన్మెంట్తమన్నాకి పెళ్లి కాకపోవడం నిర్మాతలకు కలిసొచ్చింది !

తమన్నాకి పెళ్లి కాకపోవడం నిర్మాతలకు కలిసొచ్చింది !

తమన్నాకి పెళ్లి కాకపోవడం నిర్మాతలకు బాగా ప్లస్ అయింది. అదే కాజల్ అగర్వాల్ లాగా తమన్నాకి కూడా పెళ్లి అయి ఉంటే కరోనా కాలం పోయేవరకు షూట్ కి రాలేను అంటూ ఏవో కారణాల చెబుతూ కాలక్షేపం చేసేది. అసలు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేందుకు జనం జంకుతున్నారు. అలాంటిది తమన్నా మాత్రం వరుస ప్రయాణాలతో తెగ హడావిడి చేస్తోంది. చాల రోజుల గ్యాప్ తర్వాత సడెన్ గా ఓ రోజు హైదరాబాద్ […]

తమన్నాకి పెళ్లి కాకపోవడం నిర్మాతలకు బాగా ప్లస్ అయింది. అదే కాజల్ అగర్వాల్ లాగా తమన్నాకి కూడా పెళ్లి అయి ఉంటే కరోనా కాలం పోయేవరకు షూట్ కి రాలేను అంటూ ఏవో కారణాల చెబుతూ కాలక్షేపం చేసేది. అసలు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేందుకు జనం జంకుతున్నారు. అలాంటిది తమన్నా మాత్రం వరుస ప్రయాణాలతో తెగ హడావిడి చేస్తోంది.

చాల రోజుల గ్యాప్ తర్వాత సడెన్ గా ఓ రోజు హైదరాబాద్ లో షూట్ చేస్తూ కనిపించింది. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ముంబైలో తారసపడింది. వెంటనే మళ్ళీ ఆ తర్వాత రోజు బెంగళూరులో జరుగుతున్న యాడ్ ఫిల్మ్ షూట్ లో పాల్గొంది. మొత్తానికి తమన్నా సింగిల్ కాబట్టి ఎక్కడా మింగిల్ అయ్యే అవసరం తనకు లేదు కాబట్టి, తెగ చక్కర్లు కొడుతూ రోజుకొక మహా సిటీకి ప్రయాణం చేస్తూ ఉంది.

అయితే, ఈ కరోనా టైంలో కూడా ఇలా ఆగకుండా షూటింగ్స్ పాల్గొనడం అవసరమా అని తమన్నాని అడిగితే, డబ్బులు ఊరికే రావు అంటూ తనదైన శైలిలో భారీ మేకప్ కొట్టుకుని చిన్న స్మైల్ ఇచ్చింది. అసలు ఆ మాటకొస్తే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత రోజు నుండే ఈ ముదురు మిల్కీ బ్యూటీ నితిన్ హీరోగా రూపొందుతోన్న ‘మాస్ట్రో’ సినిమా షూటింగ్ లో పాల్గొంది.

ఎట్టకేలకు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి ఆ సినిమాలోని తన పార్ట్ కి సంబంధించిన సీన్స్ ను పూర్తి చేసింది. ప్రస్తుతం ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ తెలుగు వర్షన్ కి సంబంధించిన షూట్ లో ఉంది తమన్నా. ఈ ‘మాస్టర్ చెఫ్’ తెలుగు ప్రోగ్రామ్ కి ఈ మిల్కీ బ్యూటీ హోస్ట్ గా అలరించనుంది. తమన్నాకిది మొదటి టీవీ షో కావడం విశేషం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper