Homeక్రీడలుRCB vs GT IPL playoffs : ప్లే ఆఫ్ సమరం: ఆర్సీబీకి...

RCB vs GT IPL playoffs : ప్లే ఆఫ్ సమరం: ఆర్సీబీకి శాపంగా విరాట్ కోహ్లీ.. జీటీతో మ్యాచ్ లో ఏం జరుగుతుందో..

RCB vs GT IPL playoffs : ఐపీఎల్ లో భాగంగా ధర్మశాలలో బెంగళూరు, గుజరాత్ జట్లు నేడు పోటీ పడుతున్నాయి. మరి కాసేపట్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. రెండు జట్లలో సమవుజ్జీలైన ప్లేయర్లున్నారు. దీంతో పోటీ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరు జట్టు తరఫున విరాట్ కోహ్లీ వీరోచితంగా ఆడుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అతడు దూకుడుకు పర్యాయపదంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ ప్లే ఆఫ్ లో రెచ్చిపోతే తమకు తిరుగుండదని బెంగళూరు మేనేజ్మెంట్ భావిస్తోంది.

విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడైనప్పటికీ ప్లే ఆఫ్ ముందు అతడి ఆట గురించి బెంగళూరు యాజమాన్యం కలవరపడుతోంది. ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. ఇందులో విరాట్ కోహ్లీ 557 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 50.64, స్ట్రైక్ రేట్ 163.82 గా ఉంది. విరాట్ కోహ్లీ ఫామ్ పరంగా పెద్దగా ఇబ్బంది లేకపోయిన్పటికీ ప్లే ఆఫ్ సమరంలో అతడి రికార్డులు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ సీజన్ లో చివరి లీగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హైదరాబాద్ జట్టు పై కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. దీనికి తోడు ప్లే ఆఫ్ సమరంలో విరాట్ కోహ్లీకి దారుణమైన రికార్డు ఉంది. తన కెరియర్ లో విరాట్ కోహ్లీ మొత్తం 17 ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఆడాడు. అతడి సగటు 26.40, 121.10 స్ట్రైక్ రేట్.. పైగా అతడు 396 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతడు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 70 *(2011లో చైన్నై జట్టుతోజరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ లో అతడు ఈ స్కోర్ చేశాడు)

ప్లే ఆఫ్ లో ఐదుసార్లు అతడు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు. ఒకసారి సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఐదుసార్లు ఏకంగా 30 పరుగుల లోపే వెనక్కి వెళ్లిపోయాడు. గడిచిన సీజన్ లో ప్రీతిజింటా జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. ఫైనల్ మ్యాచ్ లో 35 బంతులు ఎదుర్కొని 43 రన్స్ చేశాడు. అతడి ప్లే ఆఫ్ రికార్డ్ నిరాశపరుస్తున్ననేపథ్యంలో పాతజ్జాపకాలను మరిచిపోయి, విరాట్ ఒక రేంజ్ లో బ్యాటింగ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version