Homeక్రీడలుChris Gayle : వేలంలో ఎవరూ దేకలేదు.. సీన్ కట్ చేస్తే ఆరెంజ్ క్యాప్ తో...

Chris Gayle : వేలంలో ఎవరూ దేకలేదు.. సీన్ కట్ చేస్తే ఆరెంజ్ క్యాప్ తో సంచలనం

Chris Gayle : వేలంలో ఎవరూ దేకలేదు. కనీసం పట్టించుకోలేదు. ఇతడినేంటి కోనుగోలు చేసేది అన్నట్టుగా జట్ల యాజమన్యాలు వ్యవహరించాయి. నవ్విన నాప చేను పండుతుందన్నట్టుగా అతడు అదరగొట్టాడు. సూపర్ బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్ లో బెంగళూరు తరఫున క్రిస్ గేల్ నెలకొల్పిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడు పొట్టి ఫార్మాట్ లో సింహం లాగా రెచ్చిపోయాడు. పరుగుల వరద పారించాడు. ఇప్పటికీ అతడు సాధించిన రికార్డులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. మేటి ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడుతున్నప్పటికీ క్రిస్ గేల్ రికార్డులను ఏ ఆటగాడు బద్దలు కొట్టలేకపోతున్నాడు.

గేల్ ఆరెంజ్ క్యాప్ విభాగంలో అనేక సందర్భాల్లో స్థానం సంపాదించుకున్నాడు. బెంగళూరు తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే అతడి ఐపీఎల్ కెరియర్ లో 2010లో సీజన్ తర్వాత అతడిని కోల్ కతా నైట్ రైడర్స్ తప్పించింది. అయితే ఆ సీజన్ లో ఆసీస్ ఆటగాడు డిర్క్ నేన్స్ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో బెంగళూరు అతడిని కొనుగోలు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గేల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు.

నాటి సీజన్ లో గేల్ వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. 12 మ్యాచ్ లలో 608 పరుగులు చేశాడు. తద్వారా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోకుండా ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాడిగా గేల్ రికార్డు నెలకొల్పాడు. వాస్తవానికి కోల్ కతా తనను తప్పించడంతో గేల్ అది మనసులో పెట్టుకున్నాడు. తనను కొనుగోలు చేసిన బెంగళూరు జట్టుకు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడి తన పేరును అతడు సార్థకం చేసుకున్నాడు. గత సీజన్ లో బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత గేల్ సంబరాలు చేసుకున్నాడు. ట్రోఫీని అందుకుని విజయగర్వంతో ఉప్పొంగి పోయాడు. తోటి ప్లేయర్లతో కలిసి ఫొటోలు దిగాడు. వాటిని సోషల్ మీడియాలో పంచుకుని, తన ఆనందాన్ని మరింత పరివ్యాప్తం చేసుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version