
తెలంగానలో బీసీ కమిషన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కమిషన్ ఛైర్మన్ గా వకులాభరణం కృష్ణమోహన్ నియమితులయ్యారు. సభ్యులుగా సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పటేల్ నూలి, కె. కిశోర్ గౌడ్ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా వకులాభరణం కృష్ణమోహన్, కిశోర్ గౌడ్ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.