
దేశంలో కరోనా వైరస్ విలయం కొసాగుతున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా మహమ్మారి చాలా తీవ్రంగా ఉందని గత నెలలో పరిస్థితి తీవ్రంగా మారిందని గవర్నర్ చెప్పారు. ప్రస్తుత తరుణంలో సెకండ్ వేవ్ తో పోరాడుతున్నామన్నారు. కొవిడ్ హెల్త్ కేర్ ఇన్ ఫ్రా వసతులు కల్పించేందుకు రూ. 50 వేల కోట్ల మేర నిధులు బ్యాంకుల వద్ద రెపోరేటు వడ్డీతో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. 588 బిలియన్ డాలర్ల రిజర్వ్ ఫాెరెక్స్ నిధులు, జి- సెక్ ఆప్షన్లు వినియోగంలోకి వస్తాయన్నారు. అలాగే 2022 సెకండ్ ఆప్ కల్లా అందరికీ టీకాలు లభిస్తాయని తెలిపారు.