
ఐపీఎల్ ఆడటం కోసం భారత్ కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ షాక్ తగిలింది. భారత్ లో కరోనా కల్లోలం దృష్ట్యా ఆస్ట్రేలియా రాకపోకలను నిలిపివేసింది. అయితే తాజాగా ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లకు సైతం కరోనా సోకింది. దీంతో ఇక చేసేందేం లేక ఐపీఎల్ ను బీసీసీఐ వాయిదా వేసింది.
క్రికెటర్లు అంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మళ్లీ కరోనా పోయి సాధారణ పరిస్థితులు ఏర్పడితేనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
అయితే విమానాల నిషేధం ఉండడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు వారి దేశానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. బీసీసీఐ వారిని వారి దేశాలకు పంపే బాధ్యత మాది అని హామీ ఇచ్చింది. ప్రభుత్వాలతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని తెలిపింది.
అయితే తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం మాత్రం అసీస్ క్రికెటర్లకు షాక్ ఇచ్చింది. విమానాల నిషేధం పూర్తయ్యేవరకూ స్వదేశానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.నిషేధం ముగిసేవరకు భారత్ లోనే ఉండాలని క్రికెటర్లకు సూచించింది.
ఆటగాళ్ల కోసం ప్రత్యేక అనుమతులు లేవని.. ప్రభుత్వం కఠిన నిబంధనలను మే 15 వరకూ అమలు చేయనున్నట్లు సీఏ స్పష్టం చేసింది. అప్పటివరకూ క్రికెటర్లను దేశంలో అనుమతించబోమని సీఏ తెలిపింది.