జిల్లాలోని చందూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చందూరు శివారులో వ్యాను, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.