Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు అనుకూలమైన వాతావరణ ఉండనుంది. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : . ఈ రాశి వ్యాపారంలో ఈరోజు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు చేసే కొత్త ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే కష్టపడాల్సి వస్తుంది. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. కార్యాలయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతారు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు ఆస్తి కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. కొందరు చేసే ప్రత్యర్థుల కుట్రలు భగ్నమవుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనులు సక్సెస్ కాకపోవచ్చు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండకూడదు. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారులో ఈరోజు అత్యధిక లాభాలు పొందనున్నారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఎప్పుడు లాభాలు పొందవచ్చు. కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండకపోవచ్చు. దీంతో అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపడితే వాటి పైనుంచి లాభాలు పొందుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొందరు డబ్బులు మోసం చేసే అవకాశం ఉంటుంది. స్నేహితుల విషయంలో తొందరపాటు పనికిరాదు. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తులో జరిగే కార్యక్రమం కోసం చర్చలు ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు గతంలో చేపట్టిన ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపకూడదు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి దృష్టి పెట్టాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చెప్తారు. పిల్లలతో కలిసి సరదాగా ఉంటారు. విదేశాలనుంచి శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లాభాల పంట పండుతుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా కృంగిపోతారు. అయితే కొత్తగా పనులు ప్రారంభించే ముందు పెద్దలను సలహా తీసుకోవడం మంచిది. కుటుంబంతో కలిసి వ్యాపారం చేసే వారికి లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా కొన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అనువైన వాతావరణఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. అను అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు తల్లిదండ్రులతో సరదాగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయాలను ఎవరితో పంచుకోకుండా ఉండడమే మంచిది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి.