Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 24.11.2025 : ఈ రాశుల వారికి ఈరోజు అదృష్టం వెంబడే...

Today horoscope in telugu 24.11.2025 : ఈ రాశుల వారికి ఈరోజు అదృష్టం వెంబడే ఉంటుంది..

Today horoscope in telugu : . జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వ ఆషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వరకు ఏ పని మొదలుపెట్టిన అది ఈరోజు విజయవంతంగా పూర్తి అవుతుంది. మరికొన్ని రాశుల వారు శత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునే వారు పెద్దలను సంప్రదించాలి. విద్యార్థులు గురువుల మద్దతుతో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉండడంతో సంతృప్తిగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పటికే చేసిన ప్రయత్నాల నుంచి శుభవార్తను వింటారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కష్టపడి పని చేసిన వారికి సరైన ఫలితాలు అందుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. కొత్త భాగస్వాములు రావడంతో వ్యాపారులు అభివృద్ధి చెందుతారు. వివాహం గురించి ఆందోళన చెందుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు ఖర్చు చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు కొన్ని పనులు పూర్తి కావడానికి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల్లో అందరి సహకారంతో అణువైన వాతావరణ ఉంటుంది. దీంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులో ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త భాగస్వామిలను చేర్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే ఆలోచించాలి. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న విజయాలను పొందుతారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆదాయం పెరిగినా కూడా ఖర్చులు ఉంటాయి. వివాహం గురించి ఓ సమాచారాన్ని అందుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన ప్రణాళికలు వేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : మీ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు అద్భుతమైన లాభాలను పొందుతారు. ఉద్యోగులు అనుకున్న ఫలితాలు పొందడంతో సంతృప్తిగా ఉంటారు. కొన్ని పనులు పూర్తి చేయడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. కొత్తగా వస్తువుల కొనుగోలు కోసం ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని అవసరాల నిమిత్తం డబ్బులు ఇతరులకు ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని మంచి పనులు చేయడం ద్వారా సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రియమైన వారితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు కొత్త మార్పులు చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఉత్సాహంగా పనిచేస్తారు. వివాహ ప్రతిపాదన గురించి చర్చిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. దీంతో ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. అధికారుల నుంచి ప్రశంశాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అధికారంలో నుంచి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులకు సైతం శత్రువుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. సమాజంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : రోజువారి అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. శత్రువులను తక్కువ అంచనా వేయొద్దు. ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షలో పాల్గొనడానికి విద్యార్థులు సిద్ధమవుతారు వీరికి గురువుల మద్దతు ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) :  . ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొత్త వారితో సంప్రదించి వ్యాపార అభివృద్ధి చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంశలు అందుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్నేహితుల సహాయంతో అప్పులను తీరుస్తారు.
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular