
ఆన్లైన్ న్యూస్ పబ్లిషర్స్ కోసం ఇండియా తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు సెర్చ్ ఇంజన్ అయిన తమకు వర్తించవని గూగులం ఎల్ ఎల్ సీ వాదిస్తోంది. తమకు ఈ చట్టం వర్తిస్తూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టాలని బుధవారం ఢిల్లీ హైకోర్టును గూగుల్ కోరింది. తాము మధ్యవర్తులమే అయినా సోషల్ మీడియా మధ్యవర్తులం కాదని చెబుతూ ఏకసభ్య ధర్మాసనం తన తీర్పులో తమకు సోషల్ మీడియా మధ్యవర్తిగా గుర్తించడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ మహిళ ఫొటోలను పోర్న సైట్ల నుంచి తొలగించడానికి సంబంధించిన కేసులో గూగుల్ తన వాదనలను వినిపించింది.