
రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కేరళ సముద్రతీరం, అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు బలపడ్డాయని వాతావరణశాఖ పేర్కొంది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించి అవకాశం ఉందని స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.