
తెలంగాణలో సూపర్ స్పైడర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లకు రవాణాశాఖ ఆధ్వర్యంలో రేపు ఉచితంగా టీకాలు వేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రేపు 10 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. టీకా కేంద్రాలకు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తీసుకెళ్లాలని రవాణాశాఖ అధికారులు సూచించారు,