The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘ది ఒడిస్సీ’ చిత్రం రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయగా , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకుంది. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజున 24 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకే 44 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 36 కోట్ల 72 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఒక హాలీవుడ్ సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రావడం చిన్న విషయం అయితే కాదు.
ఇక నార్త్ అమెరికా విషయానికి వస్తే 2 వ రోజున ఈ చిత్రం ఆ ప్రాంతం నుండి 40.75 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిందట . ఓవరాల్ గా రెండు రోజుల్లో ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో 91.46 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు రోజుల్లో వచ్చిన వసూళ్లను అమెరికన్ డాలర్స్ కి మారిస్తే 5 మిలియన్ డాలర్లు అవుతుంది. ఇక ఆ తర్వాత యూరోప్ , ఇతర పశ్చిమ దేశాల నుండి వచ్చే వసూళ్లను కలిపితే ఈ చిత్రానికి రెండు రోజుల్లో 170 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని , ఓవరాల్ గా ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
అయితే ఈ చిత్రం ఇప్పుడు ప్రతిష్టాత్మక బిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందా లేదా అని అంచనాలు వేసుకుంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో 258 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు గ్లోబల్ వైడ్ గా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయట. ఈ రేంజ్ ట్రెండ్ ఉంది కాబట్టి , ఓవర్సీస్ లో హాలీవుడ్ సినిమాలకు నెలల తరబడి లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి, కచ్చితంగా 1 బిలియన్ డాలర్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వర్కింగ్ డేస్ లో ఈ చిత్రానికి ఏ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాబోతున్నాయి చూడాలి.
