Lenin Movie : అక్కినేని అఖిల్ లేటెస్ట్ సూపర్ హిట్ 9 రోజులు పూర్తి చేసుకొని 10 వ రోజులోకి అడుగుపెట్టింది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ లోకి చేరిన ఈ సినిమా, అఖిల్ కెరీర్ లోనే కాకుండా, ఈ ఏడాది భారీ హిట్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిల్చింది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 9 వ రోజున ప్రపంచవ్యాప్తంగా 1 కోటి 66 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 3 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లు 1 కోటి 35 లక్షల షేర్. ఓవరాల్ గా 9 రోజుల్లో ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిద్దాం.
నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 11 కోట్ల 64 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ నుండి 3 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 3 కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఈస్ట్ గోదావరి జిల్లా నుండి 2 కోట్ల 24 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 42 లక్షలు , గుంటూరు నుండి 2 కోట్ల 7 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 1 కోటి 56 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి కోటి రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి 26 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక + తమిళనాడు + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా ఓవర్సీస్ నుండి 3 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 32 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నేడు ఆదివారం కావడంతో అన్ని ప్రాంతాల్లోనూ ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. బుక్ మై షో యాప్ లో నేడు ఈ చిత్రానికి గంటకు 4 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఓవరాల్ గా విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, ఇప్పటి వరకు 10 కోట్ల 85 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి.
