
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త విప్లవం రాబోతోందని ఆయన అన్నారు. డెబ్బై, ఎనబై సంవత్సరాలలో అట్టడుగు వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. అక్షరం, ఆర్థికం ఎజెండగా ఫూలే, అంబేద్కర్, కాన్షిరాం ఆశయాల కోసం పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు.