
ఎట్టకేలకు భువనేశ్వర్ కు వికెట్ దక్కింది. అర్ధశతకం తర్వాత అవిష్ క ఫెర్నాండో(50) ఔటయ్యాడు. భువనేశ్వర్ వేసిన ఓవర్ లో రెండో బంతికి సింగిల్ తీసి అర్ధశతకం సాధించాడు. ఆఖరి బంతికి భారీ షాట్ ఆడబోయి కృనాల్ పాండ్యకు చిక్కాడు. భారత్ బౌలర్స్ కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. పరుగులు చేయకుండా అడ్డుకుంటున్నారు. ధనంజయ (27) నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుం శ్రీలంక 26 ఓవర్లకు 126/3 తో ఉంది.