
అమెరికాలోని నార్త్ కరోలినాలోని పాఠశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుడి కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మిగతా విద్యార్థులంతా సురక్షితంగానే ఉన్నారని పేర్కొన్నారు. విన్ స్టవ్ సేలంలోని మౌంట్ తాబోర్ హైస్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుందని దక్షిణా అమెరికా పోలీస్ డిపార్ట్ మెంట్ చీఫ్ కాట్రీనా థాంప్సన్ తెలిపారు. మహమ్మారి కారణంగా చాలా రోజులు మూతపడిన పాఠశాలలు ఇటీవల తెరువడంతో విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. పాఠశాలలో కాల్పుల ఘటన ఈ వారంలో రెండోది.