
రాబోయే నెలల్లో కొవిడ్ కేసులు కాస్త పెరిగే అవకాశం ఉందని, అయితే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా సంస్థతో మాట్లాడారు. ప్రజలు కొవిడ్ నుంచి రక్షణ పొందేందుకు టీకాలు వేసుకుంటున్నారన్నారు. వైరస్ సోకినా తేలికపాటి లక్షణాలుంటాయని, తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండదన్నారు. అయితే, ప్రజలు కొవిడ్ నియమాలను ఎంత మేరకు ఖచ్చితంగా పాటిస్తారనే విషయంపైనే కొవిడ్ ప్రవర్తన ఆధారపడి ఉంటుందన్నారు.