రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎస్ ఈ ని కోర్టు ఆదేశించింది. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, మద్యం దుకాణాలు మూసి వేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఎన్నికల విధుల్లో 2,557 పోలీసులు 7,695 మంది ఉద్యోగులను నియమించామని ఎస్ ఈసీ కోర్టుకు తెలిపింది. కరోనా విపత్తులో వాయిదా వేయకుండా ముందుకెళ్లడం బాధకరం అని అంది.