Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ బ్యానర్ లో నటించనున్న స్టార్ హీరో...

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ బ్యానర్ లో నటించనున్న స్టార్ హీరో…

Sandeep Reddy Vanga : ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న సినిమా విషయంలో ఆయన చాలావరకు ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరో అడుగు ముందుకు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డివంగా ఇంతకుముందు చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పుడు తన బ్యానర్ నుంచి రోమాంచకం అనే ఒక చిన్న సినిమాని రిలీజ్ చేస్తున్నాడు.

ఇక దీంతోపాటుగా అక్కినేని అఖిల్ ను హీరోగా పెట్టి ఒక సినిమాను తన బ్యానర్ నుంచి ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా అఖిల్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న ఒక కుర్రాడితో సినిమా చేయించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాకి సంబంధించిన కథ చర్చలైతే జరుగుతున్నాయట. ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం తన బ్యానర్ నుంచి తన అన్న ప్రణయ్ రెడ్డి ప్రొడ్యూసర్ గా ఆ సినిమా తెరకెక్కే అవకాశాలైతే ఉన్నాయంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు సందీప్ రెడ్డివంగా చేసిన మూడు సినిమాలతోనే తెచ్చుకున్నాడు. కాబట్టి తనకంటూ ఒక ఐడెంటిటి ఏర్పడింది. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా విషయంలోనే ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగుతున్నాడు. అలాంటి సందీప్ రెడ్డివంగా రాబోయే రోజుల్లో ఎలాంటి పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తాడు. తను డైరెక్ట్ చేసిన సినిమాలతోనే కాకుండా తను ప్రొడ్యూస్ చేయబోయే సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular