పోలవరం ప్రాజెక్టు కు పెరుగుతున్న గోదావరి ఉధృతి

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్ట్ కు గోదావరి ఉధృతి పెరుగుతోంది. స్పిల్ వే దగ్గర 29.7 మీటర్ల కు గోదావరి నీటి మట్టం చేరింది. స్పిల్ వే నుంచి 8.60 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో గొందూరు గండిపోచమ్మ ఆలయం పూర్తిగా నీటమునిగింది. ఏజెన్సీలో రహదారులు పూర్తిగా జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా కొన్ని గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ముంపు గ్రామాల ప్రజలకు సురక్షిత  ప్రాంతాలకు […]

Written By: Suresh, Updated On : July 25, 2021 10:04 am
Follow us on

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్ట్ కు గోదావరి ఉధృతి పెరుగుతోంది. స్పిల్ వే దగ్గర 29.7 మీటర్ల కు గోదావరి నీటి మట్టం చేరింది. స్పిల్ వే నుంచి 8.60 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో గొందూరు గండిపోచమ్మ ఆలయం పూర్తిగా నీటమునిగింది. ఏజెన్సీలో రహదారులు పూర్తిగా జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా కొన్ని గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ముంపు గ్రామాల ప్రజలకు సురక్షిత  ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దేవీపట్నం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.