https://oktelugu.com/

బాలయ్య – అనిల్ మధ్యలో మహేష్ బాబు !

అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా చేయాలని చాలా ఆశ పడ్డాడు. నిజానికి ఈ కాంబినేషన్ లో మరో సినిమా వచ్చి ఉండేదే, కానీ మహేష్, రాజమౌళితో సినిమా కోసం కొత్త సినిమాలు అంగీకరించే పరిస్థితిలో లేడు. మరోపక్క అనిల్ తనకు అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాతకు సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు. ఆ నిర్మాత ఏమో బాలయ్యకు అభిమాని. ఎలాగైనా అనిల్ – బాలయ్య కలయికలో ఒక సినిమా చేయాలని […]

Written By: , Updated On : July 25, 2021 / 10:05 AM IST
Anil Movie With Balakrishna?
Follow us on

Anil Teamup with Mahesh & Balakrishna

అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా చేయాలని చాలా ఆశ పడ్డాడు. నిజానికి ఈ కాంబినేషన్ లో మరో సినిమా వచ్చి ఉండేదే, కానీ మహేష్, రాజమౌళితో సినిమా కోసం కొత్త సినిమాలు అంగీకరించే పరిస్థితిలో లేడు. మరోపక్క అనిల్ తనకు అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాతకు సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు.

ఆ నిర్మాత ఏమో బాలయ్యకు అభిమాని. ఎలాగైనా అనిల్ – బాలయ్య కలయికలో ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే, బాలయ్యకు ఆ మధ్య అనిల్ రావిపూడి కథ కూడా చెప్పాడు. బాలయ్య కూడా సినిమా ఓకే అని చెప్పినట్లు టాక్. కానీ రీసెంట్ గా మహేష్ నుండి అనిల్ కి కబురు వెళ్ళింది.

రాజమౌళితో తాను చేసే సినిమా లేట్ అయ్యేలా ఉంది కాబట్టి, ఈ గ్యాప్ లో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని మహేష్ బాబు ఫీల్ అయ్యాడు. అనిల్ ని పిలిచి విషయం చెప్పాడు. పైగా డిసెంబర్ నుండి కాల్షీట్లు కూడా ఇచ్చాడు. మొత్తానికి అనిల్ తో సినిమాకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. కానీ బాలయ్య సినిమా ఏమి చేయాలి ?

అసలుకే బాలయ్య నిర్మాత, అనీల్ రావిపూడికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అన్నిటికి మించి బాలయ్యకి కథ చెప్పి సినిమా చేస్తున్నాం అంటూ కమిట్ అయ్యాడు. దీనికితోడు బాలయ్య – అనీల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా చాన్నాళ్లుగా నలుగుతున్న వ్యవహారం.

పైగా మహేష్ బాబు అందుబాటులో లేడని బాలయ్య వైపు చూసి.. ఇప్పుడు మహేష్ ఛాన్స్ ఇస్తున్నాడు అని అనీల్ రావిపూడి బాలయ్యతో సినిమాని పోస్ట్ ఫోన్ చేస్తే కెరీర్ కె ఎఫెక్ట్ అవుతుంది. మరి అనిల్ ఏమి చేస్తాడో చూడాలి.