Homeక్రీడలుRCB vs CSK match : బెంగళూరులో RCB బ్యాటర్ల సిక్సర్ల గర్జన.. చిన్నస్వామిలో చిన్నబోయిన...

RCB vs CSK match : బెంగళూరులో RCB బ్యాటర్ల సిక్సర్ల గర్జన.. చిన్నస్వామిలో చిన్నబోయిన చెన్నై..

RCB vs CSK match డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ఐపీఎల్లో అడుగుపెట్టిన బెంగళూరు జట్టు తొలి మ్యాచ్లో హైదరాబాద్ పై 200+ రన్స్ స్కోర్ ను చేజ్ చేసి గెలిచింది. గత ఏడాది హోమ్ గ్రౌండ్లో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా బెంగళూరు ఆడుతోంది. తొలి మ్యాచ్లో హైదరాబాద్ పై గెలిచిన బెంగళూరు.. రెండవ మ్యాచ్ చెన్నై జట్టుతో ఆదివారం తలపడుతోంది. ఈ మ్యాచ్లో బెంగళూరు ప్లేయర్లు దూకుడుగా బ్యాటింగ్ […]

RCB vs CSK match డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ఐపీఎల్లో అడుగుపెట్టిన బెంగళూరు జట్టు తొలి మ్యాచ్లో హైదరాబాద్ పై 200+ రన్స్ స్కోర్ ను చేజ్ చేసి గెలిచింది. గత ఏడాది హోమ్ గ్రౌండ్లో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా బెంగళూరు ఆడుతోంది. తొలి మ్యాచ్లో హైదరాబాద్ పై గెలిచిన బెంగళూరు.. రెండవ మ్యాచ్ చెన్నై జట్టుతో ఆదివారం తలపడుతోంది.

ఈ మ్యాచ్లో బెంగళూరు ప్లేయర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ 28, సాల్ట్ 46, దేవదత్ 50, పాటిధార్ 48*, డేవిడ్ 70* పరుగులతో కదం తొక్కారు. ఈ ఐదుగురి దూకుడు ముందు చెన్నై బౌలర్ల స్టామినా సరిపోలేదు. మొదట్లో చెన్నై బౌలర్లు కాస్త మెరుగ్గా బౌలింగ్ వేసినట్టు కనిపించింది. ఆ తర్వాత బెంగళూరు బ్యాటర్లు ఎదురుదాడికి దిగడంతో చెన్నై బౌలర్లు చేతులెత్తయక తప్పలేదు. ఈ మ్యాచ్లో ఏకంగా 19 సిక్సర్లు నమోదు అయ్యాయి. ఇందులో సాల్ట్ రెండు, విరాట్ 1, దేవదత్ రెండు, పాటిదర్ ఆరు, డేవిడ్ 8 సిక్సర్లు కొట్టారు. ఫోర్లు కేవలం 14 మాత్రమే నమోదు కావడం విశేషం. ఇందులో సాల్ట్ మూడు, విరాట్ 2, దేవదత్ 5, పాటిదార్ ఒకటి, డేవిడ్ మూడు ఫోర్లు కొట్టారు.

ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు 250 స్కోర్ నమోదు చేసింది. బెంగళూరు జట్టులో ప్రధాన ప్లేయర్లు సిక్సర్ల మోత మోగించారు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో చెన్నై జట్టు చిన్న పోయింది..

చెన్నై జట్టు బౌలర్లలో శివం దుబే రెండు ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చాడు. ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చాడు. హెన్రీ మూడు ఓవర్లు వేసి 36 పరుగులు, కాంబోజ్ నాలుగు ఓవర్లు వేసి 52 పరుగులు, నూర్ అహ్మద్ 4 ఓవర్లు వేసి 49, ఓవర్టన్ మూడు ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చారు.

ఈ మ్యాచ్లో తొలి వికెట్ కు విరాట్ కోహ్లీ సాల్ట్ 37 పరుగులు, రెండో వికెట్ కు సాల్ట్, దేవదత్ 56 పరుగులు, మూడో వికెట్ కు పాటిదర్, దేవదత్ 58 పరుగులు, నాలుగో వికెట్ కు డేవిడ్, పాటిదార్ అజేయంగా 99 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఫలితంగా చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టు 250 పరుగులు చేసింది. ప్రస్తుత ఐపిఎల్ లో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరుగా ఇది నమోదయింది. సాధారణంగా చిన్నస్వామి స్టేడియం బౌండరీ మీటర్ చిన్నగా ఉంటుంది. అందువల్లే బెంగళూరు బ్యాటర్లు రెచ్చిపోయారని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper