Ram Charan mistaken for Yash : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) , బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యక్తిగతంగా ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి స్నేహం 15 ఏళ్ళ కాలం నాటిది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉండేవారు. సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ ని తన సొంత తమ్ముడిలాగా చూసుకునేవాడు. తనకు సంబంధించిన ఏ ముఖ్య విషయం లో అయినా రామ్ చరణ్ ఉండాల్సిందే. రామ్ చరణ్ నోరు తెరిచి ఒక్క మాట అడగగానే, నయా పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా, మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో ప్రత్యేక పాత్ర పోషించాడు. అదే విధంగా రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ చిత్రం లోని ఒక పాటలో సల్మాన్ తో స్టెప్పులు వేస్తాడు.
ఇలా వాళ్ళిద్దరి మధ్య ఎన్నో సంఘటనలు జరిగాయి. అయితే రీసెంట్ గానే సల్మాన్ ఖాన్ తన 60 వ పుట్టిన రోజు సందర్భంగా తన నివాసం లో గ్రాండ్ గా పార్టీ ని నిర్వహించాడు. ఈ పార్టీ కి మన టాలీవుడ్ నుండి విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ వెళ్లారు . వీళ్ళతో పాటు బాబీ డియోల్, మహేంద్ర సింగ్ ధోని, అమీర్ ఖాన్ ఇలా తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రతీ ఒక్క సెలబ్రిటీ ఈ పార్టీ కి హాజరయ్యారు. అయితే ఇక్కడ రామ్ చరణ్ కి ఒక చిన్న అవమానం జరిగింది. ఆయన కారు లో వెళ్తున్న సమయం లో నార్త్ ఇండియన్ అభిమానులు ‘హేయ్..కార్ మే యాష్ హై..యాష్..యాష్’ అంటూ అరిచారు. అంటే రామ్ చరణ్ ని చూసి వాళ్ళు KGF హీరో యాష్ అనుకున్నారు అన్నమాట. అప్పుడు రామ్ చరణ్ వాళ్ళ వైపు చూడగానే, ‘యాష్ నహీ..రామ్ చరణ్..రామ్ చరణ్’ అంటూ అరిచారు.
రామ్ చరణ్ చిన్నగా వాళ్ళ వైపు చూసి స్మైల్ ఇస్తూ చేతులు ఊపుతాడు. కానీ ఒక్కసారిగా తనని చూసి యాష్ అని పిలవగానే రామ్ చరణ్ కాస్త ఫీల్ అయినట్టు అనిపించింది. KGF సినిమా విడుదల కొత్తల్లో కూడా మన టాలీవుడ్ ప్రేక్షకులు ఇలాగే అనుకునే వారు. ఇతనేంటి అచ్చు గుద్దినట్టు మా రామ్ చరణ్ లాగా ఉన్నాడు అంటూ అప్పట్లో కామెంట్స్ చేసేవాళ్ళు. ఇద్దరికీ పోలికలు ఆ రేంజ్ లో ఉంటాయి మరి. ఒక్క పొడవు విషయం లోనే ఇద్దరి మధ్య వ్యత్యాసం. ఇద్దరు కలిసి ఒక మల్టీస్టార్రర్ చిత్రం చేసి అందులో అన్నదమ్ముల క్యారెక్టర్స్ చేస్తే, కచ్చితంగా వీళ్లిద్దరు నిజమైన బ్రదర్స్ లాగానే అనిపిస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
https://www.youtube.com/shorts/UIqZG-1EimY
