Allu Arjun Atlee Movie Netflix Rights : ప్రస్తుతం మన టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఏంటి? అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ‘వారణాసి'(Varanasi Movie). రాజమౌళి(SS Rajamouli), మహేష్ బాబు(Superstar Mahesh Babu) కాంబినేషన్ లో తెరతెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 1300 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. ఈ చిత్రానికి పోటీ ఇచ్చే మరో సినిమా అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) ప్రాజెక్ట్. ఇంకా టైటిల్ కూడా ఖరారు అవ్వని ఈ సినిమాకు కూడా దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసి తీస్తున్నారు. అయితే ఈ సినిమాకు ‘వారణాసి ‘ ని మించిన క్రేజ్ ఉందని లేటెస్ట్ గా మార్కెట్ లో వినిపిస్తున్న వార్త. హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్ తో, హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూడు లోకాలకు సంబంధించిన సినిమా. నటీనటులు కూడా టాప్ రేంజ్ వాళ్ళు ఉన్నారు.
అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం 600 కోట్ల రూపాయిలను సన్ పిక్చర్స్ సంస్థకు ఆఫర్ చేసిందట. గతం లో ఇదే నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘వారణాసి’ చిత్రానికి 500 కోట్లు ఆఫర్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ మూవీ మరో వంద కోట్లు అదనంగా ఆఫర్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆఫర్ ని సన్ పిక్చర్స్ సంస్థ ఇంకా ఖరారు చేయలేదు. వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో అల్లు అర్జున్ సినిమాలకు గతం లో అద్భుతమైన ఆదరణ దక్కింది. ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం ఏకంగా 30 వారాలు టాప్ 10 లో ట్రెండ్ అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత గత ఏడాది విడుదలైన ‘పుష్ప 2’ చిత్రం 13 వారాల పాటు ట్రెండ్ అయ్యింది.
దాదాపుగా 30 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ రేంజ్ లాభాలు వచ్చాయి కాబట్టే , నెట్ ఫ్లిక్స్ సంస్థ అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ కి ఈ రేంజ్ ఆఫర్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఈ ఆఫర్ ఇంకా పెరగొచ్చు కూడా. చూడాలి మరి ఫైనల్ గా ఇంతకు సెట్ అవుతుంది అనేది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్స్ గా దీపికా పడుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లు నటిస్తుండగా, విలన్ రోల్ లో రష్మిక మందాన నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్ గా ఎన్నో సంచలనాత్మక విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ, విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న రష్మిక మొదటిసారి కెరీర్ లో విలన్ రోల్ లో కనిపించబోతుండడం విశేషం. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు 40 శాతం కి పైగా టాకీ పార్ట్ పూర్తి అయ్యినట్టు సమాచారం.