Nidhhi Agerwal about Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం మరో 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, మూవీ టీం ప్రొమోషన్స్ ని వేగవంతం చేసింది. రీసెంట్ గానే హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతం లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేసుకున్న ఈ చిత్రం టీం, ఇప్పుడు మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ఇకపోతే నేడు మధ్యాహ్నం విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కి ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ముఖ్యంగా ప్రభాస్ ని జోకర్ గెటప్ లో చూసి థ్రిల్ ఫీల్ అయ్యారు. అంత పెద్ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తన అభిమానులను అలరించడానికి ఎలాంటి గెటప్ లో అయినా కనిపించడానికి రెడీ అనేది ప్రభాస్ ఈ గెటప్ తో చెప్పకనే చెప్పాడు ప్రభాస్.
ఇకపోతే ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. వీరిలో నిధి అగర్వాల్ ప్రొమోషన్స్ ఇరగ కుమ్మేస్తున్న విషయం వాస్తవం. రీసెంట్ గానే ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ తో పని చేసిన అనుభూతిని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో కలిసి నటించడం అనేది నేను చేసుకున్న అదృష్టం. కానీ ఒక విషయం లో మాత్రం నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను ప్రభాస్ పొడవుని మ్యాచ్ చేయడానికి పాపం మూవీ టీం చాలా కష్టపడింది. ఆయనతో కలిచి నటించే సన్నివేశాలు వచ్చినప్పుడు, అదే విధంగా పాటల్లో డ్యాన్స్ వేయాల్సి వచ్చినప్పుడు నేను నా ఎత్తుని పెంచే స్టాండ్ ని షూటింగ్ లో ఉపయోగించాల్సి వచ్చింది’.
‘నా కెరీర్ లో ఇలా జరగడం ఇదే తొలిసారి. మొట్టమొదటిసారి నా పొడవు విషయం లో ఫీల్ అయ్యాను. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి మొదట్లో కాస్త భయమేసేది. అంత పెద్ద సూపర్ స్టార్ తో సెట్స్ లో ఎలా నడుచుకోవాలో అని భయపడ్డాను. కానీ ఆయన స్పోర్టివ్ గా ఉన్నారు, నన్ను చాలా కంఫర్ట్ జోన్ లో ఉంచాడు. ఇకపోతే నా కెరీర్ లో మొట్టమొదటి సారి నేను ఒక ప్రయోగం చేశాను. ఈ చిత్రానికి స్వయంగా నేనే తెలుగులో డబ్బింగ్ చెప్పాను. తెలుగు ఆడియన్స్ మీద ప్రేమతో చేస్తున్న పని ఇది. వాళ్లకు బాగా దగ్గర అయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను’ అంటూ నిధి అగర్వాల్ మాట్లాడిన మాటలు, ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.
