
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జమ్మూకశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు ఘులాం అహ్మద్ మిర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం మధ్య కశ్మీర్ లోని గందెర్ బల్ జిల్లాలో ఉన్న ఖీర్ భవాని ఆలయాన్ని రాహుల్ దర్శించుకున్నారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.