
సినీ నటుల క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక స్టార్ యాక్టర్స్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది మంది అభిమానులు ఉండే నటీనటులు బయటికి వస్తే చాలు.. ఫ్యాన్స్ చుట్టు ముట్టేస్తారు. వారిని టచ్ చేయాలని, వీలైతే ఓ సెల్ఫీ అంటూ మీద మీదకు వచ్చేస్తారు. ఇలాంటి సమయంలో బాడీ గార్డ్స్ లేకుంటే.. దూసుకొచ్చే ఫ్యాన్స్ ను నిలువరించడం అసాధ్యమనే చెప్పాలి. అందుకే.. తమ రక్షణ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న బౌన్సర్లను నియమించుకుంటారు సినీనటులు.
ఈ విషయం అందరికీ తెలుసు. కానీ.. వారికి ఎంత జీతం ఇస్తారనేది మాత్రం దాదాపుగా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనం ఇదే విషయం చర్చించుకోబోతున్నాం. సినీ స్టార్లు వారి బాడీ గార్డ్స్ కు ఇచ్చే వేతనం తెలిస్తే.. సామాన్యులు నోరెళ్లబెట్టడం ఖాయం. సాఫ్ట్ వేర్ సాలరీలకు మించిన వేతనం అందుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. మరి, ఆ వివరాలేంటో చూద్దాం.
బాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఉన్న షారూఖ్ ఖాన్ తన బాడీ గార్డ్ రవిసింగ్ కు ఏడాదికి 2.7 కోట్ల రూపాయలను వేతనంగా ఇస్తున్నాడు. అంటే.. నెలకు 22.50 లక్షలు! ఏ సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి ఈ వేతనం తక్కువ చెప్పండి? ఇక మరో స్టార్ సల్మాన్ కూడా భారీగానే చెల్లిస్తున్నాడు. ఆయన అంగరక్షకుడు షేర్నాకి ఏడాదికి రూ.2 కోట్ల మేర చెల్లిస్తున్నాడు.
ఇక, విరాట్ సతీమణి అనుష్క శర్మ తన బాడీగార్డ్ ప్రకాశ్ కు ఏడాదికి 1.2 కోట్లు చెల్లిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా ఇంతే చెల్లిస్తోంది. తన బాడీగార్డ్ జలాల్ కు ఏడాదికి 1.2 కోట్ల రూపాయలను వేతనంగా చెల్లిస్తోంది. మిగిలిన స్టార్ యాక్టర్స్ కూడా ఇంచుమించు ఇదేవిధంగా.. వేతనాలు చెల్లిస్తున్నారట. కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్న నటీనటులకు ఈ అమౌంట్ పెద్దదేమీ కాదు. ఈ డబ్బుకన్నా.. వారి వ్యక్తిగత రక్షణమే కీలకం మరి!