
ప్రేమోన్యాది చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గుంటూరు జిల్లా నరసరావుపేటకు వెళ్తున్న నారా లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా దృష్ట్యా అనుమతి లేదంటూ గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకున్నారు. మాజీ మంత్రులు, ఇతర టీడీపీ నేతలను గృహనిర్భంధం చేశారు. నరసరావుపేటకు వెళ్లే ఇతర మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.