
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఆగస్టు లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికారవర్గాల సమాచారం. జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు పై చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఈనెల 10న అమలు చేయనున్న వైఎస్ఆఱ్ నేతన్న నేస్తం పథకం పై చర్చించనున్నట్లు సమాచారం.