
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు కొంత సమయానికే లాభాల్లోకి ఎగబాకి ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిష్టీ నేటి ట్రేడింగ్ లో ఓ దశలో 171 పాయింట్లు లాభపడి 15,606 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 147 పాయింట్ల లాభంతో 15,582 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 514 పాయింట్లు ఎగబాకి 51,937 వద్ద స్థిరపడింది. దాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.61 వద్ద నిలిచింది.