
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఆనందయ్య సహామరో ఇద్దరు వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కంటిలో వేసే డ్రాప్స్ పై గురువారంలోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆనందయ్య మందుపై ఈరోజు ఉదయం, మధ్యాహ్నం హైకోర్టులో విచారణ కొనసాగింది.