
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశఆ, ఝార్ఖండ్ సీఎంలతో మోదీ మాట్లాడారు. అయితే ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మాట్లాడిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ కేవలం ఆయన మనసులో ఉన్న మాటల్నీ మాత్రమే బయటపెట్టారని తాము చెప్పే అంశాలను కూడా విని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ రోజు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన కేవలం తన మనసులోని మాటను బయటపెట్టారు. చేయాల్సిన పనులతో పాటు మేం చెప్పే అంశాలు కూడా విని ఉంటే బాగుండేది అని సోరెన్ ట్విటర్ లో రాసుకొచ్చారు.