
కరోనా చికిత్స కోసం వచ్చి ఇటీవల వరంగల్ ల పోలీసులకు పట్టుబడిన మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి చెందాడు. అతడిని ఈనెల 2న అదుపులోకి తీసుకున్న పోలీసులు కరోనా చికిత్స కోసం నగరంలోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు మధుకర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మధుకర్ స్వస్థలం కుమురం భీం జిల్లా జెజ్జూర్ మండలం కొత్తపల్లి గ్రామం. 22 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ దళంలో సభ్యుడిగా చేరారు.