Homeఎంటర్టైన్మెంట్Lenin Movie : 'లెనిన్' 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇదేమి కుమ్ముడు బాబోయ్.....

Lenin Movie : ‘లెనిన్’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇదేమి కుమ్ముడు బాబోయ్.. జోరు అసలు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తూనే ఉంది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఇప్పుడు లాభాలను లెక్కేసుకుంటోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 4 వ రోజున 2 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ […]

Lenin Movie : అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తూనే ఉంది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఇప్పుడు లాభాలను లెక్కేసుకుంటోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 4 వ రోజున 2 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి రాగా, 5 వ రోజున 1 కోటి 97 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే ముందు రోజుతో పోలిస్తే 80 శాతం కి పైగా హోల్డ్ ఉందన్నమాట. ఇది సాధారణమైన విషయం కాదు , అద్భుతమైన లాంగ్ రన్ కి సూచిక ఇది. 5 రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 5 రోజుల్లో 9 కోట్ల 23 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ ప్రాంతం లో జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రూపాయిలు. ఇప్పటి వరకు 2 కోట్ల 23 లక్షల లాభాలు కేవలం ఈ ఒక్క ప్రాంతం నుండే వచ్చాయి. అదే విధంగా సీడెడ్ నుండి 2 కోట్ల 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , ఉత్తరాంధ్ర నుండి 2 కోట్ల 83 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 1 కోటి 92 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 21 లక్షలు , గుంటూరు నుండి 1 కోటి 80 లక్షలు , కృష్ణ నుండి 1 కోటి 35 లక్షలు , నెల్లూరు నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 21 కోట్ల 82 లక్షల రూపాయిల షాట్ వసూళ్లు , 36 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1 కోటి 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ కూడా ఈ చిత్రం పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి 27 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు , 49 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి వారం 55 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ ని అందుకుంటుందో లేదో అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper