కేరళలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం అధికార ఎల్డీఎఫ్ కూటమి అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. సీఎం పినరయి విజయన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక భాజపా సీఎం అభ్యర్థి మెట్రమ్యాన్ శ్రీధరన్ పాలక్కాడ్ నియోజక వర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. యూడీఎఫ్ కూటమి నేత, మాజీ సీఎం ఊమెన్ చాందీ పూతుపల్లిలో ఆధిక్యం కనబరుస్తున్నారు.